తండ్రిని చంపిన కొడుకులు?.. భూపాలపల్లి జిల్లాలో సంచలనం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ఏప్రిల్ 05: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకులే తండ్రిపై దాడి చేసి ప్రాణాలు తీసిన సంఘటన కలకలం రేపుతోంది. రేగొండ మండలం రేపాక గ్రామంలో ఈ ఘటన జరిగింది.
స్థానికుల వివరాల ప్రకారం, కుర్రే చేరాలు (45) అనే వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంపై అనుమానం వచ్చిన కొడుకులు, వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఇద్దరు కొడుకులు తండ్రిపై విచక్షణారహితంగా దాడికి దిగారు.
దాడి సమయంలో గొడ్డలితో కూడా దాడి చేయడంతో చేరాలు తీవ్రంగా గాయపడ్డాడు. అతనితో పాటు సంబంధం ఉన్న మహిళపై కూడా దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ చేరాలు శనివారం రాత్రి మృతి చెందగా, మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment