-->

KTPS పన్నుల చెక్కు కమిషనర్‌కు అందజేత – కాలనీలో సదుపాయాలపై కార్పొరేటర్ డిమాండ్

KTPS పన్నుల చెక్కు కమిషనర్‌కు అందజేత – కాలనీలో సదుపాయాలపై కార్పొరేటర్ డిమాండ్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ 4వ డివిజన్‌కు చెందిన KTPS ప్రాంతంలోని ఇళ్లు, స్థలాల పన్నుల చెక్కును 15.04.2026న కమిషనర్ సుజాత గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి మరియు KTPS అధికారులు పాల్గొన్నారు.

గత సంవత్సరం మున్సిపాలిటీ పన్నులుగా KTPS తరఫున రూ.36,54,146/- విలువైన చెక్కును కూడా కమిషనర్ సుజాత గారికి కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి సమక్షంలో KTPS సివిల్ విభాగానికి చెందిన శ్రీను (ADE), దీపిక (ADE) అందజేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, KTPS కాలనీ నుంచి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ కాలనీలో తగిన పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై పారిశుద్ధ్య పనులు, పార్కుల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.

అదేవిధంగా కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా చిన్నారులు, యువత, వృద్ధులకు ఉపయోగం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై కమిషనర్ సుజాత గారు సానుకూలంగా స్పందించినట్లు కార్పొరేటర్ భాగ్యలక్ష్మి తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793