-->

బొలెరో బోల్తా.. బాలుడు మృతి, 10 మందికి గాయాలు

పెళ్లి నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. బొలెరో బోల్తా.. బాలుడు మృతి, 10 మందికి గాయాలు


మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో అదుపుతప్పిన బొలెరో వాహనం పల్టీలు కొట్టడంతో ఒక బాలుడు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు.

చిన్నచింతకుంట మండలం దమజ్ఞాపూర్, ఎదులాపూర్, అల్లిపూర్ గ్రామాలకు చెందిన కుటుంబ సభ్యులు పాతమొల్గర గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం కలెక్టరేట్ ముందు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టింది.

ఈ ప్రమాదంలో దమజ్ఞాపూర్ గ్రామానికి చెందిన సాయి వర్షిత్ (6) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో పద్మ, లక్ష్మి, కృష్ణవేణి, కృష్ణయ్య, రాజు, మండ్ల కొండన్న, సురేందర్, తిరుపతయ్య, సత్యనారాయణ గౌడ్ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793