-->

జూన్ 21న మళ్లీ నీట్-యూజీ పరీక్ష

జూన్ 21న మళ్లీ నీట్-యూజీ పరీక్ష


హైదరాబాద్, మే 20: దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్రబిందువైన నీట్-యూజీ 2026 పరీక్షపై కీలక అప్డేట్ వెలువడింది. ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రద్దైన పరీక్షను తిరిగి నిర్వహించేందుకు National Testing Agency కొత్త తేదీని ప్రకటించింది. జూన్ 21, ఆదివారం దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ అధికారికంగా వెల్లడించింది.

పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి Dharmendra Pradhan మంగళవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కఠిన భద్రతా నిబంధనల మధ్య పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు వెల్లువెత్తడంతో పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. గత పరీక్ష నిర్వహణలో గుర్తించిన లోపాలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు, అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల సమాచారం త్వరలోనే లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793