-->

నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్.. రూ.50 లక్షల టాయ్ కరెన్సీ స్వాధీనం

నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్.. రూ.50 లక్షల టాయ్ కరెన్సీ స్వాధీనం


శ్రీ సత్యసాయి జిల్లాలో సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపెట్టించి అమాయకులను మోసం చేయాలని యత్నించిన నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ అధికారుల వేషధారణలో తిరుగుతూ భారీ మోసాలకు పాల్పడేందుకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “ఒక లక్ష అసలు నోట్లు ఇస్తే రూ.10 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తాం” అంటూ ప్రజలను నమ్మించి మోసం చేయాలని నిందితులు ప్రణాళిక రచించారు. అసలు నకిలీ నోట్ల బదులుగా టాయ్ కరెన్సీ ఇచ్చి డబ్బులు దోచుకోవాలని ప్రయత్నించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.

హిందూపురం పోలీసుల అప్రమత్తతతో ఈ భారీ మోసం భగ్నమైంది. నిందితుల వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన టాయ్ కరెన్సీ, పోలీస్ వేషధారణ సామగ్రి, కౌంటింగ్ మెషీన్‌తో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు వివరాలను హిందూపురం టౌన్ సీఐ రాజ్ గోపాల్ నాయుడు, టౌన్ సీఐ కరీం, హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, అప్గ్రేడ్ సీఐ ఆంజనేయులు మీడియాకు వెల్లడించారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793