-->

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎయిర్ ఇండియా బస్సు దగ్ధం

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎయిర్ ఇండియా బస్సు దగ్ధం

newsupta9 : మే 26: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం ఉదయం ఎయిర్ ఇండియాకు చెందిన బస్సు అగ్నికి ఆహుతైంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వర్క్‌షాప్ నుంచి సర్వీసింగ్ కోసం ఆటోనగర్ వైపు వెళ్తుండగా పెద్ద అంబర్పేట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తీవ్ర ఎండల కారణంగా మంటలు వేగంగా వ్యాపించి కొద్ది సేపటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.

అయితే డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సు నుంచి దూకి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనతో ఔటర్ రింగ్ రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Blogger ఆధారితం.