గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. చొక్కాలు పట్టుకుని తోపులాట
హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ సీనియర్ నేత, మంత్రి Mohammad Azharuddin పక్కన కూర్చోవడంపై కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్‌ఖాన్, కార్వాన్ ఇన్‌చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
మొదట మాటల యుద్ధంగా ప్రారంభమైన ఈ వివాదం క్రమంగా ఉద్రిక్తంగా మారి, ఇద్దరు నేతలు ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకునే స్థాయికి చేరింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఉస్మాన్ ఆల్ హాజ్రీ, ఫిరోజ్‌ఖాన్‌ను తోసేయడంతో ఆయన కిందపడిపోయినట్లు సమాచారం.
గాంధీభవన్‌లో సీనియర్ నేతల సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు V. Hanumantha Rao వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.
అయితే ఆవేశంలో ఉన్న నేతలు వీహెచ్‌ను కూడా పక్కకు నెట్టే ప్రయత్నం చేయడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అనంతరం అక్కడున్న ఇతర కాంగ్రెస్ నేతలు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి ఇరువర్గాలను విడదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Post a Comment