-->

కిశోర బాలికలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి:

కిశోర బాలికలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్


కరీంనగర్ జిల్లా, మే 20: మహిళలతో పాటు కిశోర బాలికలు కూడా తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ సూచించారు. ముఖ్యమంత్రి Revanth Reddy ప్రారంభించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మే 20 నుండి 23 వరకు నిర్వహిస్తున్న కిశోర బాలికల ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని బుధవారం జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మెప్మా, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.

వైద్యురాలు డాక్టర్ చందన మాట్లాడుతూ 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కిశోర బాలికలకు హిమోగ్లోబిన్, షుగర్ తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలికలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలు ఉన్న బాలికలకు మే 23 వరకు ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ మొలుగు చందన, హెల్త్ సూపర్‌వైజర్ అరుణ, కొండపాక సదానందం, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్‌ఎం రాధ, మెప్మా సిఎల్‌ఆర్పీలు జ్యోతి, అర్పిలు, ఆశా వర్కర్లు మరియు పలువురు కిశోర బాలికలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793