సీఎం రేవంత్ రెడ్డికి సరస్వతి అంత్య పుష్కరాల ఆహ్వానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రం అయిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న “సరస్వతి అంత్య పుష్కరాల” మహోత్సవాలకు ముఖ్యమంత్రి A. Revanth Reddyను ఆహ్వానించారు.
దేవాదాయ శాఖ మంత్రి Konda Surekha, ఆలయ అర్చక బృందం, ఉన్నతాధికారులు కలిసి ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్కరాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ముఖ్యమంత్రి గారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
సరస్వతి అంత్య పుష్కరాలను భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు Vem Narender Reddy, Chamala Kiran Kumar Reddy, ప్రభుత్వ విప్ Beerla Ilaiah, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈవో మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment