-->

మున్సిపాలిటీదా..? గ్రామపంచాయతీదా..? వాదనల మధ్య పారిశుధ్య సమస్య

కోర్టు, రిజిస్ట్రార్‌, ఆర్టీఓ కార్యాలయాల సమీపంలో చెత్త కుప్పలు – దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు


మున్సిపాలిటీదా..? గ్రామపంచాయతీదా..? వాదనల మధ్య పారిశుధ్య సమస్య

కోర్టు, రిజిస్ట్రార్‌, ఆర్టీఓ కార్యాలయాల సమీపంలో చెత్త కుప్పలు – దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారిశుధ్య సమస్య తీవ్రంగా మారింది. జిల్లా కోర్టు వెనుక భాగంలో ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయం పక్కన భారీగా చెత్త పేరుకుపోయి దుర్గంధ వాసన వెదజల్లుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రాంతం తమ పరిధిలోకి రాదని మున్సిపాలిటీ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది పరస్పరం బాధ్యతలు తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ఇది మా ఏరియా కాదు”, “మా పరిధిలోకి రాదు” అంటూ ఒకరిపై మరొకరు నెట్టేసుకోవడంతో నెలల తరబడి చెత్త తొలగింపు పనులు నిలిచిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

జిల్లా కోర్టు, రిజిస్ట్రార్ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయాలకు ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు చెత్త కుప్పల కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా చెత్త చాలా రోజులుగా పేరుకుపోవడంతో దుర్వాసన వ్యాపించి కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో చెత్త తొలగించకపోతే దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

హద్దుల వివాదాలను పక్కనపెట్టి మున్సిపాలిటీ మరియు గ్రామపంచాయతీ అధికారులు సమన్వయంతో వ్యవహరించి చెత్తను వెంటనే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు అధికంగా సంచరించే ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793