-->

సింగరేణి ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు లేని డబ్బులు తెలంగాణ ఆవిర్భావనికి ఖర్చుకు?

సింగరేణి ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు లేని డబ్బులు తెలంగాణ ఆవిర్భావనికి ఖర్చుకు?

సింగరేణి ఆవిర్భావ దినోత్సవానికి డబ్బులు లేవని చెప్పిన యాజమాన్యం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు మాత్రం భారీగా ఖర్చు చేయడం ఏమిటని హెచ్‌ఎంఎస్‌ జాతీయ కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ ప్రశ్నించారు.

సింగరేణి సంస్థ యాజమాన్యం పూర్తిగా ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు.

“కాస్ట్ కటింగ్” పేరుతో డబ్బులు లేవని చెప్పి, అన్ని కార్మిక సంఘాలు ఎంత విజ్ఞప్తి చేసినా సింగరేణి డే వేడుకలను నిర్వహించకుండా యాజమాన్యం వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం నిధులు ఎలా అందుతున్నాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పెద్దలు చెప్పిందే చేస్తూ, ప్రతి విషయంలో తలాడించే ఉన్నతాధికారులు సంస్థను సమర్థవంతంగా ఎలా నడిపించగలరని ఆయన ప్రశ్నించారు. కార్మికుల గౌరవం, సంస్థ సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు.

సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని కార్మిక వర్గం తీవ్రంగా ఖండించాలని, ఈ అంశంపై యాజమాన్యం వెంటనే స్పష్టత ఇవ్వాలని హింద్ మజ్దూర్ సభ నేత ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ డిమాండ్ చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793