-->

అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన వంశీకి ఘన సన్మానం

 

అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన వంశీకి ఘన సన్మానం

అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన వంశీకి ఘన సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 9: అఖిల భారత పోలీస్ వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్ 2026-27 పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించిన క్రీడాకారుడు వంశీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియంలో అథ్లెటిక్స్ క్రీడాకారులు ఘనంగా సత్కరించారు. శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.

హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లోని మధుబన్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన 3వ అఖిల భారత పోలీస్ వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలలో వంశీ పవర్ లిఫ్టింగ్ 59 కిలోల విభాగంలో మొత్తం 400 కిలోల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో ఆయన సాధించిన ఈ విజయం జిల్లా క్రీడా వర్గాల్లో ఆనందాన్ని నింపింది.

ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో అథ్లెటిక్స్ కోచ్‌లు మల్లికార్జున్ రావు, సుష్మ భాయ్ మాట్లాడుతూ, వంశీ కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని అందుకున్నారని ప్రశంసించారు. జాతీయ స్థాయిలో పతకం సాధించడం చిన్న విషయం కాదని, ఆయన విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న అథ్లెటిక్స్ క్రీడాకారులు వంశీకి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793