-->

సామాజిక సేవలకు గాను ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్ ఇన్ సీఎస్‌ఆర్ అవార్డు అందుకున్న నవ లిమిటెడ్

సామాజిక సేవలకు గాను ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్ ఇన్ సీఎస్‌ఆర్ అవార్డు అందుకున్న నవ లిమిటెడ్

సామాజిక సేవలకు గాను ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్ ఇన్ సీఎస్‌ఆర్ అవార్డు అందుకున్న నవ లిమిటెడ్

హైదరాబాద్, జూన్ 9: సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న Nava Limited సంస్థకు ప్రతిష్ఠాత్మకమైన ఎఫ్‌టీసీసీఐ (FTCCI) ఎక్సలెన్స్ ఇన్ సీఎస్‌ఆర్ అవార్డు–2026 లభించింది. జూబ్లీహిల్స్‌లోని JRC Convention Centre వేదికగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి D. Sridhar Babu చేతుల మీదుగా నవ లిమిటెడ్ ప్రతినిధులు ఈ అవార్డును అందుకున్నారు.


సంస్థ తరఫున చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బత్తుల శ్రీనివాసరావు, కంపెనీ సెక్రటరీ మరియు వైస్ ప్రెసిడెంట్ వి.ఎస్.ఎన్. రాజు, డీజీఎం (రా మెటీరియల్స్) కే. శ్రీహరి రెడ్డి, సీఎస్‌ఆర్ మేనేజర్ సీహెచ్. శ్రీనివాసరావు, సోషల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎం. శ్రీనివాసరావు అవార్డును స్వీకరించారు.

ఈ సందర్భంగా నవ లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు యూనిట్ హెడ్ (తెలంగాణ ఆపరేషన్స్) రియర్ అడ్మిరల్ ఎల్.వి. శరత్ బాబు మాట్లాడుతూ, ఆరోగ్యం, విద్య, జీవనోపాధి అభివృద్ధి, సామాజిక సంక్షేమ రంగాల్లో సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేయడం గర్వకారణమని తెలిపారు. సమాజాభివృద్ధికి అంకితభావంతో చేపడుతున్న కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు ఆర్. రవికుమార్, జూనియర్ వైస్ ప్రెసిడెంట్ కె.కె. మహేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ జి. శ్రీనివాస్‌తో పాటు కె. భాస్కర్ రెడ్డి, అనిల్ అగర్వాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సీఎస్‌ఆర్ రంగంలో నవ లిమిటెడ్ సాధించిన ఈ గుర్తింపు సంస్థ సామాజిక బాధ్యత పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793