మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి 2 రోజుల జైలు శిక్ష
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి 2 రోజుల జైలు శిక్ష
కొత్తగూడెం, జూలై 20: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి. రవికుమార్ రెండు రోజుల జైలు శిక్ష విధించారు.
కోర్టు వివరాల ప్రకారం, ములకలపల్లి మండలం సుందర్‌నగర్‌కు చెందిన రవ్వ వినోద్ ఈ ఏడాది ఏప్రిల్ 29న అధిక మోతాదులో మద్యం సేవించి వాహనం నడుపుతూ సుజాతనగర్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో చిక్కాడు. బ్రెత్ అనలైజర్ పరీక్షలో అతనిలో 210 శాతం మద్యం స్థాయి నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై సుజాతనగర్ ఎస్‌ఐ ఎం. రమాదేవి కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో, మేజిస్ట్రేట్ బి. రవికుమార్ రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ కేసు విచారణలో సుజాతనగర్ కోర్టు డ్యూటీ అధికారి ఎ. మోహన్ రావు సహకారం అందించారు.
ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ బి. రవికుమార్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. అలాగే ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతను దృష్టిలో ఉంచుకుని మద్యం సేవించి వాహనాలు నడపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

Post a Comment