రైలు పొడవే 7 కిలోమీటర్లు..! ప్రపంచంలోనే అతి పొడవైన ట్రైన్ ఏదో తెలుసా?
రైలు పొడవే 7 కిలోమీటర్లు..! ప్రపంచంలోనే అతి పొడవైన ట్రైన్ ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ఆస్ట్రేలియాలో నడిచే BHP ఐరన్ ఓర్ గూడ్స్ ట్రైన్. దీని పొడవు సుమారు 7.3 కిలోమీటర్లు. ఈ భారీ రైలులో 682 వ్యాగన్లు, 8 శక్తివంతమైన ఇంజన్లు ఉంటాయి. ఇది ప్రయాణికుల కోసం కాకుండా ఇనుప ఖనిజం (Iron Ore) రవాణా కోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తారు.
ఈ రైలు ఆస్ట్రేలియాలోని గనుల నుంచి పోర్టులకు ఐరన్ ఓర్‌ను భారీ మొత్తంలో తరలిస్తూ ప్రపంచంలోనే అతి పొడవైన గూడ్స్ రైలుగా గుర్తింపు పొందింది. ఒకేసారి లక్షల టన్నుల ఖనిజాన్ని రవాణా చేయగల సామర్థ్యం దీనికి ఉంది.
ఇక భారతదేశంలో కూడా అత్యంత పొడవైన గూడ్స్ రైళ్లలో ఒకటైన 'రుద్రాస్త' గతేడాది నుంచి సేవలందిస్తోంది. దీని పొడవు సుమారు 4.5 కిలోమీటర్లు. ఇందులో 354 వ్యాగన్లు ఉండగా, వాటిని లాగేందుకు 7 ఇంజన్లు ఉపయోగిస్తారు.
సాధారణంగా గూడ్స్ రైళ్లలో 40 నుంచి 60 వ్యాగన్లు మాత్రమే ఉంటాయి. అయితే రుద్రాస్తలో 354 వ్యాగన్లు ఉండటం విశేషం. అంటే దాదాపు ఆరు సాధారణ గూడ్స్ రైళ్ల సరుకు సామర్థ్యాన్ని ఒకే రైలుతో తరలించే అవకాశం ఉంటుంది. దీంతో సరుకు రవాణా వేగవంతం కావడంతో పాటు, గూడ్స్ రైళ్ల కోసం ప్రయాణికుల రైళ్లను తరచూ నిలిపివేయాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.

Post a Comment