-->

ప్రతి ఓటరును ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయండి: నాగా సీతారాములు

 

ప్రతి ఓటరును ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయండి: నాగా సీతారాములు

ప్రతి ఓటరును ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయండి: నాగా సీతారాములు

కూసుమంచి: ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు భాగస్వామ్యం కావాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పాలేరు కో-ఆర్డినేటర్ నాగా సీతారాములు పిలుపునిచ్చారు.

కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో తుంబూరు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఈఆర్ఓ జొన్నలగడ్డ రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని బీఎల్ఏ సూపర్‌వైజర్లకు పలు సూచనలు చేశారు.

ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఓటరు వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు లేదా తొలగింపులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గణన (ఎన్యూమరేషన్) ఫారాన్ని పూర్తిగా నింపి సమర్పించాలని కోరారు.

గ్రామాల్లోని ప్రతి అర్హత కలిగిన ఓటరును ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంతో పాటు, బీఎల్ఏలతో సమన్వయం చేసుకుని సరైన వివరాలతో ఫారాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని నాగా సీతారాములు తెలిపారు. ప్రతి ఓటును పరిరక్షించడం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమని ఆయన పేర్కొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793