సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎస్పీ రోహిత్ రాజు
సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కార్మికులు, స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకోవడం, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రోహిత్ రాజు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇల్లందు క్రాస్ రోడ్‌లోని సింగరేణి గెస్ట్ హౌస్లో జరిగిన ఈ భేటీలో ఎస్పీ రోహిత్ రాజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో మంత్రి పర్యటన, సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై స్వల్పంగా చర్చించినట్లు తెలిసింది.
మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పర్యటన సజావుగా సాగేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు, సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కార్మికులు, ప్రజలను ఉద్దేశించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Post a Comment