-->

సీఎం గారూ.. తెల్ల రేషన్ కార్డు వారికే ఫ్రీ బస్సు చేయండి: కాంగ్రెస్ కార్యకర్త రజిత వినతి

 

సీఎం గారూ.. తెల్ల రేషన్ కార్డు వారికే ఫ్రీ బస్సు చేయండి: కాంగ్రెస్ కార్యకర్త రజిత వినతి

సీఎం గారూ.. తెల్ల రేషన్ కార్డు వారికే ఫ్రీ బస్సు చేయండి: కాంగ్రెస్ కార్యకర్త రజిత వినతి

వేములవాడ, జూలై 13: తెలంగాణలో మహిళలకు అమలు చేస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకంపై కాంగ్రెస్ కార్యకర్త రజిత స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా బస్సుల్లో తీవ్ర రద్దీ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రావణ్–రజిత దంపతులు ప్రస్తుతం సికింద్రాబాద్‌లో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కోసం సోమవారం తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. అదే సమయంలో సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సు రావడంతో భారీగా ప్రయాణికులు ఒక్కసారిగా ఎక్కేందుకు ప్రయత్నించడంతో తీవ్ర రద్దీ నెలకొంది.

ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ, "సీఎం గారూ.. ఫ్రీ బస్సు వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బస్సుల్లో రద్దీ కారణంగా ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తున్నాయి. రేవంత్ అన్న అభిమానిగా, కాంగ్రెస్ కార్యకర్తగా చెబుతున్నా.. కనీసం హాఫ్ టికెట్ అయినా పెట్టండి. లేదంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకే ఉచిత బస్సు సౌకర్యం కల్పించండి" అని కోరారు.

ఉచిత బస్సు పథకం వల్ల మహిళలకు ప్రయోజనం కలుగుతున్నప్పటికీ, రద్దీ సమయంలో సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793