-->

రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్య.. పాత కక్షలే కారణమా?

 

మీర్‌పేట్‌లో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్య.. పాత కక్షలే కారణమా?

మీర్‌పేట్‌లో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్య.. పాత కక్షలే కారణమా?

హైదరాబాద్ భాగ్యనగరంలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గతంలో పలు నేర కేసుల్లో నిందితుడిగా ఉన్న నందనవనం సూరిపై కొన్ని నెలల క్రితం నగర బహిష్కరణ (Rowdy Sheeter Externment) విధించారు. అంతకుముందు తన భార్యతో పాటు బావమరిది సల్మాన్‌ను హత్య చేసిన కేసులో కూడా సూరి నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఆ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ ముందుగానే పథకం రచించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తన స్నేహితుడి పుట్టినరోజు వేడుక పేరుతో సూరిని మీర్‌పేట్ పరిధిలోని టీకేఆర్ కాలేజ్ సమీపానికి పిలిపించాడు.

అక్కడికి చేరుకున్న వెంటనే అఫ్రోజ్ సూరిపై దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు. ముందుగా అతని కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి ప్రతిఘటించే అవకాశం లేకుండా చేసి, అనంతరం కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన సూరిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వ్యక్తిగత కక్షలు, పాత వైరం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్‌తో పాటు ఘటనలో పాల్గొన్న ఇతరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793