బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న మానస (20) అనే విద్యార్థిని ప్రైవేట్ హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
హాస్టల్ సిబ్బంది గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, హాస్టల్ నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనతో కళాశాల, హాస్టల్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment