-->

ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్.. భద్రతా లోపాలపై ప్రశ్నలు

 

ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్.. భద్రతా లోపాలపై ప్రశ్నలు

ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్.. భద్రతా లోపాలపై ప్రశ్నలు

సిద్దిపేట, జులై 25: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం భద్రతా లోపం వెలుగుచూసింది. వైద్య పరీక్షల కోసం జైలు నుంచి ఏడుగురు రిమాండ్ ఖైదీలను పోలీసులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సమయంలో బైక్ దొంగతనాల కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సాయికుమార్ పోలీసుల కళ్లుగప్పి పరారైన ఘటన కలకలం రేపింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, పోలీస్ వాహనంలోని ఎమర్జెన్సీ డోర్ ద్వారా సాయికుమార్ తప్పించుకుని పారిపోయినట్లు తెలుస్తోంది. అతడు పలు బైక్ దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి శిక్ష అనుభవిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఖైదీ పరారైన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై జిల్లా వ్యాప్తంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రధాన రహదారులు, చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల వద్ద నిఘా పెంచారు. పరారైన ఖైదీని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఖైదీల భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖైదీ ఎలా తప్పించుకున్నాడనే అంశంపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793