SIR సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
SIR సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, జూలై 25: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శనివారం కొనసాగుతున్న SIR సవరణ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమం నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పౌరుల వివరాల నమోదు, సవరణల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ, నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ నరసింహాలపేటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, తాగునీరు, వసతి, పరిశుభ్రత, ఆరోగ్య సదుపాయాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతి, సురక్షితమైన వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
అలాగే విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులకు సూచించారు.

Post a Comment