-->

ప్రేమించి పెళ్లి.. ఇంట్లోకి రానివ్వలేదు.. భర్త ఇంటిముందు భార్య నిరసన

 

ప్రేమించి పెళ్లి.. ఇంట్లోకి రానివ్వలేదు.. భర్త ఇంటిముందు భార్య నిరసన

ప్రేమించి పెళ్లి.. ఇంట్లోకి రానివ్వలేదు.. భర్త ఇంటిముందు భార్య నిరసన

గద్వాల: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, తల్లిదండ్రులు అంగీకరించడం లేదనే కారణంతో భార్యను ఇంట్లోకి రానివ్వకపోవడంతో నవవధువు న్యాయం కోసం భర్త ఇంటి ముందు నిరసనకు దిగిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం, అనంతపురం గ్రామానికి చెందిన మాలిక్ అనే యువకుడు, గద్వాల పట్టణానికి చెందిన ఓ యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ మంగళవారం బీచుపల్లి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం భర్త ఇంటికి వెళ్లగా, అతని తల్లిదండ్రులు పెళ్లిని అంగీకరించకుండా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో భర్త కూడా ఆమెను భార్యగా స్వీకరించబోనని చెప్పడంతో బాధితురాలు బుధవారం భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టింది.

సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇదిలా ఉండగా, ఇదివరకే ప్రేమ వ్యవహారంలో అదే యువకుడిపై బాధిత యువతి గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆ కేసు ఈ నెలలో విచారణకు రానున్న నేపథ్యంలో, కేసు నుంచి తప్పించుకునేందుకే యువకుడు పెళ్లి చేసుకుని, అనంతరం తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ ఆమెను నిరాకరించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793