-->

తెలంగాణలో ఏరోస్పేస్ పెట్టుబడులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

 

తెలంగాణలో ఏరోస్పేస్ పెట్టుబడులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఏరోస్పేస్ పెట్టుబడులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌లు, అంతరిక్ష రంగ సంస్థల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కె. చందన, సహ వ్యవస్థాపకుడు, సీఓఓ భరత్ డాకా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతినిధులు భారతదేశంలోనే ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం 'విక్రమ్-1' విజయవంతమైన ప్రయోగం గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఘన విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేటు రంగం ద్వారా ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు.

సమావేశంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల విస్తరణ, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ & డీ), అలాగే ప్రభుత్వం–ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా స్కైరూట్ వ్యవస్థాపకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. వారు సాధించిన విజయం భారత అంతరిక్ష రంగానికి కొత్త గుర్తింపును తీసుకువచ్చిందని, ప్రపంచ అంతరిక్ష పరిశ్రమలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రశంసించారు. అలాగే తెలంగాణను ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు, పరిశోధన, తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793