-->

పాము కాటుతో యువకుడు మృతి.. చికిత్సకు నిర్లక్ష్యం ప్రాణాలు తీసింది

 

పాము కాటుతో యువకుడు మృతి.. చికిత్సకు నిర్లక్ష్యం ప్రాణాలు తీసింది

పాము కాటుతో యువకుడు మృతి.. చికిత్సకు నిర్లక్ష్యం ప్రాణాలు తీసింది

మహబూబాబాద్, జూలై 23: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి శివారు సోమవరపుకుంట తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాము కాటుకు గురైన యువకుడు సకాలంలో చికిత్స తీసుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్ ప్రవీణ్ (25) బుధవారం రాత్రి భోజనం అనంతరం ఇంటి ముందు రేకుల షెడ్ కింద నిద్రిస్తున్నాడు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో కట్ల పాము అతని కాలి మడమ వద్ద కాటు వేసింది. వెంటనే మేల్కొన్న ప్రవీణ్ కాటు వేసిన పామును చంపేశాడు.

కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి వెళ్లి యాంటీ స్నేక్ వెనం ఇంజెక్షన్ తీసుకోవాలని సూచించినప్పటికీ, "ఏమీ కాదులే" అంటూ ప్రవీణ్ నిర్లక్ష్యం చేశాడు. అనంతరం రాత్రి ఒంటిగంట సమయంలో వాంతులు, విరోచనాలు ప్రారంభం కావడంతో పరిస్థితి విషమించింది.

దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రవీణ్ మృతి చెందాడు.

ప్రవీణ్ చిన్న వయసులోనే తన తండ్రి బానోత్ లాల్ సింగ్ను కోల్పోయాడు. ప్రస్తుతం అతనికి తల్లి బానోత్ రంగమ్మ, భార్య మమత, ఐదుగురు అక్కలు ఉన్నారు. యువకుడి మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గమనిక: పాము కాటు వేసిన వెంటనే ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా సమీప ఆసుపత్రికి వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793