-->

రాజుల కొత్తపల్లి గ్రామపంచాయతీ భవనానికి వెంటనే నిధులు విడుదల చేయాలి

 

రాజుల కొత్తపల్లి గ్రామపంచాయతీ భవనానికి వెంటనే నిధులు విడుదల చేయాలి

రాజుల కొత్తపల్లి గ్రామపంచాయతీ భవనానికి వెంటనే నిధులు విడుదల చేయాలి: వరిపల్లి అనిల్ కుమార్

నెల్లికుదురు, జూలై 30: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని రాష్ట్ర యువ నాయకులు వరిపల్లి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.

ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని పాత గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో సుమారు మూడు సంవత్సరాల క్రితం అధికారులు దానిని కూల్చివేశారని తెలిపారు. అదే స్థలంలో కొత్త గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు పనులు పూర్తికాకపోవడం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం గ్రామపంచాయతీకి సొంత భవనం లేకపోవడంతో పక్కనే ఉన్న వాటర్ ప్లాంట్ గదిలో తాత్కాలికంగా కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. వర్షాలు కురిసినప్పుడు ఆ గదిలోకి నీరు కారడం వల్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించాలంటే శాశ్వత గ్రామపంచాయతీ కార్యాలయం అత్యవసరమని వరిపల్లి అనిల్ కుమార్ పేర్కొన్నారు. మండల, జిల్లా అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన నిధులు విడుదల చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా గ్రామ యువకులు, నాయకులతో కలిసి మాట్లాడిన వరిపల్లి అనిల్ కుమార్, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో గ్రామ ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793