-->

కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. మహబూబాబాద్‌లో విషాద ఘటన

 

కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. మహబూబాబాద్‌లో విషాద ఘటన

కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. మహబూబాబాద్‌లో విషాద ఘటన

మహబూబాబాద్: జిల్లాకేంద్రంలోని భవానీనగర్ తండాలో కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. భార్య, కుమారుడు కలిసి కుటుంబ పెద్దను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పసందుల చంద్రయ్య (55) మంగళవారం మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఈ సందర్భంగా భార్య విజయలక్ష్మి, కుమారుడు వీరాచారితో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన ఇద్దరూ చంద్రయ్య గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులైన భార్య విజయలక్ష్మి, కుమారుడు వీరాచారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు దారితీసిన అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఘటనతో భవానీనగర్ తండాలో విషాద ఛాయలు అలుముకోగా, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793