బ్యాటరీ పేలి బాలుడు మృతి.. కొమురం భీం జిల్లాలో విషాదం
బ్యాటరీ పేలి బాలుడు మృతి.. కొమురం భీం జిల్లాలో విషాదం
కొమురం భీం ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలో బ్యాటరీ పేలి 15 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. చింతలమానపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన నికార్డి లోకేష్ (15) బుధవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో గుర్తు తెలియని బ్యాటరీని నోటితో కొరికినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా బ్యాటరీ పేలిపోవడంతో లోకేష్ ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కాగజ్‌నగర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే లోకేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆడుకుంటూ జరిగిన ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించగా, వారి రోదనలు స్థానికులను కలచివేశాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment