-->

GOOD NEWS: జూలై 15 నుంచి కొత్త EHS హెల్త్ కార్డులు అమలు.. ఉద్యోగులకు క్యాష్‌లెస్ వైద్యం

 

GOOD NEWS: జూలై 15 నుంచి కొత్త EHS హెల్త్ కార్డులు అమలు.. ఉద్యోగులకు క్యాష్‌లెస్ వైద్యం

GOOD NEWS: జూలై 15 నుంచి కొత్త EHS హెల్త్ కార్డులు అమలు.. ఉద్యోగులకు క్యాష్‌లెస్ వైద్యం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు శుభవార్త. ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS)లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఇకపై ఈ పథకం కింద అందించే వైద్య సేవలు, చికిత్సలకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) ప్యాకేజీ రేట్లు వర్తింపజేయనుంది. ఈ నిర్ణయానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా అంగీకారం తెలిపారు.

సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నూతన EHS విధానాన్ని జూలై 15 నుంచి అధికారికంగా అమలు చేయాలని నిర్ణయించారు.

సీఎం చేతుల మీదుగా కొత్త హెల్త్ కార్డుల ప్రారంభం

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి త్వరలో కొత్త EHS హెల్త్ కార్డులను ప్రారంభించనున్నారు. అనంతరం ఉద్యోగులు, పెన్షనర్లు అధికారిక వెబ్‌సైట్‌లోని QR కోడ్ ద్వారా తమ హెల్త్ కార్డులను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించడమే ఈ కొత్త విధానం లక్ష్యమని సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలతో ప్రభుత్వం మరో నాలుగు రోజుల్లో జీవో (GO) జారీ చేయనుంది.

943 ఆస్పత్రుల్లో 2,594 రకాల చికిత్సలు

కొత్త EHS విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంప్యానెల్ చేసిన 943 కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 2,594 రకాల వైద్య చికిత్సలు (ప్రొసీజర్లు) ఈ పథకం పరిధిలోకి వస్తాయి.

అలాగే పథకానికి సంబంధించిన ఆస్పత్రుల జాబితా, చికిత్సల వివరాలు, ఇతర సేవల సమాచారంతో ప్రత్యేకంగా EHCT మొబైల్ యాప్ను కూడా ప్రభుత్వం రూపొందించనుంది.

మరో 24 వెల్‌నెస్ సెంటర్లు

ఉద్యోగులకు ఔట్ పేషంట్ (OP) సేవలు, ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందులు అందించేందుకు ప్రస్తుతం ఉన్న 12 వెల్‌నెస్ సెంటర్లతో పాటు మరో 24 జిల్లా కేంద్రాల్లో కొత్త వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సమావేశంలో టీఎన్‌జీఓ, టీజీఓ, పీఆర్‌టీయూ, యూటీఎఫ్‌, సెక్రటేరియట్ అసోసియేషన్‌, ట్రెసా, ఎస్‌టీయూ, క్లాస్-4 ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793