-->

దుబ్బాకలో బెల్ట్ షాపులపై పోలీసుల దాడి.. 10.75 లీటర్ల మద్యం స్వాధీనం

 

దుబ్బాకలో బెల్ట్ షాపులపై పోలీసుల దాడి.. 10.75 లీటర్ల మద్యం స్వాధీనం

దుబ్బాకలో బెల్ట్ షాపులపై పోలీసుల దాడి.. 10.75 లీటర్ల మద్యం స్వాధీనం

దుబ్బాక: అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు బెల్ట్‌ షాపులపై పోలీసులు దాడి చేసి 10.75 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలక పరిధిలోని దుంపలపల్లి నాలుగో వార్డులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు దుబ్బాక సీఐ రాజేష్, ఎస్‌ఐ కీర్తిరాజు, ఎస్‌ఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దుంపలపల్లి నాలుగో వార్డులో అక్రమ మద్యం విక్రయాలపై తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్న కోల రాజు ఇంటిపై దాడి చేయగా 8.25 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప్పునూతల రవి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 2.5 లీటర్ల మద్యం సీసాలు పట్టుబడ్డాయి.

మొత్తంగా రెండు ప్రాంతాల్లో కలిపి 10.75 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కోల రాజు, ఉప్పునూతల రవిపై కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ రాజేష్ తెలిపారు. అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793