-->

రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల తర్వాత ఊరట.. క్లర్క్, ప్యూన్‌కు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్

 

రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల తర్వాత ఊరట.. క్లర్క్, ప్యూన్‌కు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్

రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల తర్వాత ఊరట.. క్లర్క్, ప్యూన్‌కు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్

1996లో నమోదైన రూ.20 లంచం కేసులో గుజరాత్ ప్రభుత్వానికి చెందిన క్లర్క్, ప్యూన్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. దిగువ కోర్టులు విధించిన శిక్షలను రద్దు చేస్తూ ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

విద్యార్థికి ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.120 లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు వారిపై వచ్చాయి. ఏసీబీ నిర్వహించిన ట్రాప్‌లో ప్యూన్ వద్ద రూ.20 నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే క్లర్క్ వద్ద ఆరోపించిన రూ.100 మాత్రం లభించలేదు.

లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఫిర్యాదుదారు వాంగ్మూలంలోనూ పలు భిన్నతలు ఉన్నాయని గుర్తించింది. కేవలం రూ.20 నగదు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన లంచం డిమాండ్, స్వీకరణ రుజువైనట్లు భావించలేమని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో దిగువ కోర్టు, గుజరాత్ హైకోర్టు తీర్పులను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. క్లర్క్, ప్యూన్‌ను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో దాదాపు 30 ఏళ్లుగా సాగిన న్యాయ పోరాటానికి ఎట్టకేలకు ముగింపు లభించింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793