-->

జిల్లా కోర్టులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జిల్లా కోర్టులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు


జిల్లా కోర్టులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కొత్తగూడెం లీగల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి వందనం చేసి, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రయోజనాలకంటే సమష్టి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ‘నేను’ అనే భావనను విడిచిపెట్టి ‘మనము’ అనే భావనతో అందరినీ కలుపుకొని ముందుకు సాగితే సమాజానికి, ప్రతి ఒక్కరికీ ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఎం. రాజేందర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కవిత కర్నాటి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.వి. హిమ పూజిత, రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి. రవికుమార్, కూకట్‌పల్లి నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి తోటరాముడి స్వప్న, ఆదిలాబాద్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ అధ్యక్షుడు (పూర్తి అదనపు బాధ్యతలు) సి.హెచ్.వి. నర్సింహారావు పాల్గొన్నారు.

అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ మురళీద్కర్, ప్రధాన కార్యదర్శి గడిపల్లి మహేశ్వర్ రావు, కార్యవర్గ సభ్యులు గడదేశీ నాగరాజు, బానోత్ దేవదాస్, దొడ్డ ప్రసాద్, సంధ్యారాణి, ఉమ నకిరేకంటి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు, పోలీస్ ప్రాసిక్యూటింగ్ అధికారులు అజయ్ కుమార్, అనిల్ కుమార్, కోర్టు సిబ్బంది, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మట్ట రవీందర్, సిస్టమ్ ఆఫీసర్ నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దేశభక్తి, ఐక్యతను చాటుతూ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793