-->

కుటుంబ కలహాలతో విసిగిపోయిన కుమారుడు.. హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాలతో విసిగిపోయిన కుమారుడు.. హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నం


కుటుంబ కలహాలతో విసిగిపోయిన కుమారుడు.. హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నం

రామవరం: కుటుంబంలో తరచూ జరుగుతున్న కలహాలతో మనస్తాపానికి గురైన ఓ 17 ఏళ్ల బాలుడు హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతంలో చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం.. రామవరానికి చెందిన సంగిశెట్టి రాఘవేంద్ర (17) తన తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న కుటుంబ కలహాలతో కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శనివారం తీవ్ర ఆవేదనకు గురైన రాఘవేంద్ర హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితిపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు పారా లీగల్ వాలంటీర్‌గా వాసర్ల నాగమణికు సమాచారం అందించారు. దీంతో ఆమె హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రాఘవేంద్రను పరామర్శించారు.

అనంతరం రాఘవేంద్రతో మాట్లాడి అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి, భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ మనోధైర్యాన్ని నింపారు. కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని, సమస్యలను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన పెద్దలతో పంచుకోవాలని సూచించారు.

ప్రస్తుతం రాఘవేంద్ర ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపినట్లు పారా లీగల్ వాలంటీర్‌గా వాసర్ల నాగమణి వెల్లడించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో కుటుంబాల్లో తలెత్తే సమస్యలను పిల్లలపై ప్రభావం పడకుండా తల్లిదండ్రులు పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని వాసర్ల నాగమణి  అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పిల్లలు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నప్పుడు వారితో ఆప్యాయంగా మాట్లాడి, అవసరమైతే నిపుణుల కౌన్సిలింగ్ అందించాలని సూచించ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793