సినీ పరిశ్రమలో విషాదం.. విలన్ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. విలన్ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత
తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమల్లో తన విలక్షణ విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించడంతో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు ఆయన మేనేజర్ వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ప్రదీప్ రావత్ హిందీ చిత్రాలతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'సై' చిత్రంలో భిక్షు యాదవ్ పాత్రతో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం 'ఛత్రపతి', 'గజినీ', అలాగే హిందీలో 'లగాన్', 'సర్ఫరోష్' వంటి చిత్రాల్లో శక్తివంతమైన విలన్ పాత్రలతో ప్రత్యేక ముద్ర వేశారు.
'సై' చిత్రంలో నటనకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్న ఆయన, దక్షిణాది భాషలతో పాటు హిందీ చిత్రాల్లోనూ దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహనటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

Post a Comment