-->

భార్యపై అనుమానంతో దారుణం.. రాయితో దాడి చేసి గొంతు కోసిన భర్త

 

భార్యపై అనుమానంతో దారుణం.. రాయితో దాడి చేసి గొంతు కోసిన భర్త

భార్యపై అనుమానంతో దారుణం.. రాయితో దాడి చేసి గొంతు కోసిన భర్త

నారాయణఖేడ్, ఆగస్టు 5: సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ఇరక్‌పల్లి గ్రామంలో కుటుంబ కలహాలు, భార్యపై అనుమానం ఓ మహిళ ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యను రాయితో దాడి చేసి, అనంతరం కత్తితో గొంతు కోసి భర్త హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన **సయ్యద్ ముల్తాన్ (35)**కు 13 సంవత్సరాల క్రితం మనూరు మండలం అతిమ్యాల్ గ్రామానికి చెందిన **పర్వీన్ (32)**తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముల్తాన్ దర్గాలో పూజలు చేస్తూ, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే భార్యపై అనుమానంతో తరచూ గొడవలు జరిగేవని, దీంతో ఆరు నెలల క్రితం పర్వీన్ పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం. పెద్దల జోక్యంతో 11 రోజుల క్రితం తిరిగి భర్త వద్దకు వచ్చింది.

సోమవారం అర్ధరాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, ఆగ్రహానికి లోనైన ముల్తాన్ ముందుగా రాయితో పర్వీన్‌పై దాడి చేసి, అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని సమీపంలోని దర్గాలో పడేశాడు.

అనంతరం సమీప గిరిజన తండాకు వెళ్లి జరిగిన విషయం చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న నాగల్‌గిద్ద పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఘటనా స్థలాన్ని ఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793