ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్‌గా ఎస్. సోమనాథ్
ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్‌గా ఎస్. సోమనాథ్
హైదరాబాద్, ఆగస్టు 21: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డులో పార్ట్‌టైమ్, నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా నియమించారు.
ఆర్బీఐ గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. సోమనాథ్ నియామకం 2026 ఆగస్టు 20 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయన నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఏరోస్పేస్ ఇంజినీర్ అయిన సోమనాథ్ అంతరిక్ష రంగంలో పలు కీలక హోదాల్లో సేవలందించారు. 2025 జనవరిలో ఇస్రో ఛైర్మన్ పదవి నుంచి పదవీ విరమణ చేసిన అనంతరం బెంగళూరు సమీపంలోని చాణక్య విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా నియమితులయ్యారు.
ఇదిలా ఉండగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్రాను కూడా ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో పార్ట్‌టైమ్, నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా మరో నాలుగేళ్లపాటు కొనసాగిస్తూ పునర్నియమించినట్లు ఆర్బీఐ మరో ప్రకటనలో వెల్లడించింది.

Post a Comment