-->

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

 

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

అబ్దుల్లాపూర్‌మెట్‌లో మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 7: అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్‌బీనగర్ జోన్, నాగోల్ సర్కిల్‌లో గౌరెల్లి–ప్రతాప్‌సింగారం మూసీ వంతెన సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం నీటిలో కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మూసీ నది నుంచి బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతుడు నీలిరంగు జీన్స్ ప్యాంట్, గోధుమరంగు షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మూసీ ప్రవాహంలో కొట్టుకువచ్చాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి గుర్తింపు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు నాగోల్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793