గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అచీవర్ అబ్దుల్ నుమాన్‌కు ఘన సన్మానం
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అచీవర్ అబ్దుల్ నుమాన్‌కు ఘన సన్మానం
పాల్వంచ, సెప్టెంబర్ 19: చిన్న వయసులోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి పాల్వంచతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చిన అబ్దుల్ నుమాన్‌కు ఘన సన్మానం జరిగింది. జమాత్-ఇ-ఇస్లామీ హింద్ (JIH) ఉమెన్స్ వింగ్ పాల్వంచ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ నుమాన్‌ను పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు.
కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అర్బన్ ప్రెసిడెంట్ షహనాజ్, జిల్లా రూరల్ ప్రెసిడెంట్ సఫుర సుమయ్య, JIH పాల్వంచ యూనిట్ ప్రెసిడెంట్ ఫహిమీద బేగం, JIH పాల్వంచ ఖాతూన్ నజ్మా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. JIH పాల్వంచ యూనిట్ సభ్యులు పర్వీన్, నస్రిన్, సమీనా, రాబియాతో పాటు అబ్దుల్ నుమాన్ తల్లి ఆయేషా ఫిర్దోస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. అబ్దుల్ నుమాన్ చిన్న వయసులోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం పాల్వంచ ప్రజలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గర్వకారణమని అన్నారు. కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో, బాక్సింగ్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ విజయాలు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు.
క్రీడా రంగంలో అబ్దుల్ నుమాన్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. భవిష్యత్తులో దేశ, విదేశాల్లో మరిన్ని విజయాలు సాధించి పాల్వంచతో పాటు తెలంగాణ రాష్ట్రానికి మరింత మంచి పేరు తీసుకురావాలని కోరారు.

Post a Comment