పాలసీ ప్రకారమే EP ఆపరేటర్ల డిప్యూటేషన్ HMS కేంద్ర కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్
పాలసీ ప్రకారమే EP ఆపరేటర్ల డిప్యూటేషన్ HMS కేంద్ర కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్
గోదావరిఖని: OCP-1 నుంచి OCP-2కు EP ఆపరేటర్లను డిప్యూటేషన్‌పై పంపించే ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని HMS కేంద్ర కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామి డిమాండ్ చేశారు. కంపెనీ అవసరాల మేరకు డిప్యూటేషన్ చేపడుతున్న నేపథ్యంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా పాలసీ ప్రకారం అర్హత కలిగిన ఉద్యోగుల జాబితాను రూపొందించాలని కోరారు.
డిప్యూటేషన్‌కు అర్హులైన ఉద్యోగుల జాబితాను ముందుగానే నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలని, తద్వారా ప్రతి ఉద్యోగికి సమాచారం అందడంతో పాటు అందరికీ సమాన అవకాశం లభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పాలసీలో పేర్కొన్న నిబంధనలు, అర్హతలను ప్రాతిపదికగా తీసుకుని జాబితాను రూపొందించాలని సూచించారు.
ఉద్యోగుల మధ్య ఎలాంటి వివక్షకు అవకాశం లేకుండా ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామి కోరారు. JBCCI జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు డిప్యూటేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ALP వైస్ ప్రెసిడెంట్ శాంతి స్వరూప్, బ్రాంచ్ సెక్రటరీ గోషిక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment