కీర్తిశేషులు కోనేరు నాగేశ్వరరావు 8వ వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించిన తనయులు
కీర్తిశేషులు కోనేరు నాగేశ్వరరావు 8వ వర్ధంతిని
ఘనంగా నివాళులు అర్పించిన తనయులు
కీర్తిశేషులు కోనేరు నాగేశ్వర రావు కృష్ణా జిల్లా మారేడుమాక గ్రామంలో అత్యుతరామయ్య, సీతమ్మ దంపతులకు రెండవ సంతానంగా 1937 ఆగష్టు 30న జన్మించారు. 1954లో ఫారెస్టు కాంట్రాక్టర్‌గా కొత్తగూడెం వచ్చి ఆయన ఇక్కడే
స్థిరపడ్డారు. 1959లో ధనలక్ష్మిని వివాహం చేసుకున్న
ఆయనకు కూతురు ఉషారాణి, కుమారులు కోనేరు పూర్ణచందర్‌రావు, కోనేరు సత్యనారాయణ సంతానం.
ఆయన 1983లో తొలిసారిగా కొత్తగూడెం శాసనసభ నియోకవర్గం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. తర్వాత 1985, 1994లో ఇదే నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా గెలిచారు. 1988లో ఎన్టీఆర్ కేబినెట్‌లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 1994 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆయన లయన్స్ క్లబ్ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశారు.
13 ఏళ్లుగా లయన్స్ క్లబ్ మల్టిపుల్ కౌన్సిల్ కన్వీనర్‌గా సేవలందించిన ఆయన లయన్స్ క్లబ్ 324 జిల్లాల గవర్నర్‌గా ఉన్నారు. 1981 నుంచి క్లబ్ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, కీర్తిశేషులు కోనేరు నాగేశ్వర రావు కొత్తగూడెంలోని శ్రీనగర్ కాలనీలో గల తన స్వగృహంలో 2016, ఆగస్టు 5, శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ రోజు కీర్తిశేషులు కోనేరు నాగేశ్వరరావు 8వ వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించిన తనయులు, కుటుంబ సభ్యులు, అబభిమానులు.

Post a Comment