లయన్ సిహెచ్.వి. శివ ప్రసాద్‌కు అంతర్జాతీయ గౌరవం
అమెరికా కొత్తగూడెం మిలీనియం లయన్స్ క్లబ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, గత జిల్లా గవర్నర్ లయన్ సిహెచ్.వి. శివ ప్రసాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ఆయనకు బిజినెస్ మేనేజ్‌మెంట్ మరియు సోషల్ వర్క్ రంగాల్లో చేసిన విశేష సేవల పట్ల గుర్తింపుగా అమెరికాలోని బర్లింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ "హానరిస్ కాసా డాక్టరేట్ (Ph.D.)" అవార్డును ప్రకటించింది.
యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ లారా మే జూలై 19, 2025 న విడుదల చేసిన అధికారిక ఉత్తరంలో రిఫరెన్స్ నెం. BSU/HCDA/CON/4162 ప్రకారం, యూనివర్సిటీ సెనేట్ ఈ డిగ్రీని మంజూరు చేసింది. యూనివర్సిటీ డాక్టోరల్ మానిటరింగ్ బోర్డ్ సిహెచ్.వి. శివ ప్రసాద్‌ను హానరిస్ కాసా పిహెచ్‌డి అవార్డుకు ఎంపిక చేయడం గర్వకారణంగా పేర్కొంది.
ఈ అవార్డు ప్రదానోత్సవం జూలై 27, 2025 న న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్, లోధి రోడ్ లో జరగనుంది. మరింత సమాచారం కోసం సమన్వయకర్త డాక్టర్ దినేష్ పాండేను (+91 87092 65899) సంప్రదించవచ్చని యూనివర్సిటీ పేర్కొంది.
లయన్ శివ ప్రసాద్‌కు ఈ గౌరవ డిగ్రీ లభించడం కొత్తగూడెం జిల్లాకు గర్వకారణంగా మారింది. ఆయన సేవలను గుర్తించిన బర్లింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి, శివ ప్రసాద్‌ను అభినందిస్తున్నందుకు పలువురు సామాజిక, వ్యాపార వేత్తలు శుభాకాంక్షలు తెలిపారు.
Post a Comment