-->

బీబీపేటలో ఉచిత నేత్ర పరీక్షా శిబిరం విజయవంతం

బీబీపేటలో ఉచిత నేత్ర పరీక్షా శిబిరం విజయవంతం


బీబీపేట, జూలై 27: బీబీపేట వాసవి క్లబ్ ఆవరణలో నేడు నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్షా శిబిరం ఘనవిజయం సాధించింది. సిద్ధిపేటకు చెందిన ప్రఖ్యాత కృష్ణ సాయి ఐ హాస్పిటల్ మరియు సెంటర్ ఫర్ సైట్ సంస్థల ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించబడింది. గ్రామానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్  బచ్చు కృష్ణమూర్తి మరియు డాక్టర్  పెద్ది శ్రీపతి ఈ శిబిరాన్ని సమర్థవంతంగా నడిపారు.

ప్రారంభంలో 162 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 35 మందికి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించారు. కానీ పేషెంట్ల సందర్శన భారీగా ఉండటంతో మొత్తం 185 మందికి పరీక్షలు జరిపి చివరకు 54 మందికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఈ శస్త్ర చికిత్సలు సిద్ధిపేటలోని కృష్ణ సాయి ఐ హాస్పిటల్‌లో ఉచితంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ సైట్ నిర్వాహకులు హరీష్, వాసవి క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం, మాజీ డిప్యూటీ గవర్నర్ విశ్వ ప్రసాద్, అంతర్జాతీయ కోఆర్డినేటర్ భాశెట్టి నాగేశ్వర్, నిలబైరయ్య, గాంధారి సిద్ధరాములు, పెద్ది నాగేశ్వర్, హరి ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నేత్ర వైద్య నిపుణులు గడిల విజయకుమార్ మరియు కిరణ్ కుమార్ మురికి శ్రీనివాస్ లు కూడా శిబిరంలో చురుకుగా పాల్గొన్నారు. డాక్టర్ బచ్చు కృష్ణమూర్తి గారిని, డాక్టర్ శ్రీపతి గారిని ప్రత్యేకంగా శాలువాలతో సన్మానించడం జరిగింది.

గ్రామస్థుల నుంచి ఈ శిబిరానికి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. పేదవారికి పెద్దయిన వరమై నిలిచిన ఈ శిబిరం సేవాధర్మానికి అద్భుత ఉదాహరణగా నిలిచిందని ప్రతి ఒక్కరూ పేర్కొన్నారు.

Blogger ఆధారితం.