-->

మద్యపు మత్తుకు బానిసైన ఓ కుమారుడు తల్లి ప్రాణాలు తీశాడు.

 

మద్యపు మత్తుకు బానిసైన ఓ కుమారుడు తల్లి ప్రాణాలు తీశాడు.

నిద్రలేపి తల్లిని హతమార్చిన క్రూరుడు

కర్నూలు :  కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన రుద్రాక్షల ఎల్లమ్మ (75) గురువారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వేళ ఆమె కుమారుడు జమ్ములు (40) మద్యం కోసం డబ్బులు అడిగాడు. తల్లి నిరాకరించడంతో కోపంతో శుక్రవారం తెల్లవారుజామున ఆమె ముక్కు మూసి ఊపిరాడనీయకుండా హత్య చేశాడు.

మృతురాలి బంధువుల ప్రకారం, జమ్ములు మద్యానికి బానిసై తరచూ డబ్బులు డిమాండ్‌ చేసేవాడని, ఇవ్వకపోతే గొడవపడేవాడని తెలిపారు. వృద్ధురాలి హత్య వార్త తెలిసిన కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, మూడో పట్టణ సీఐ శేషయ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులు పరిశీలించారు. స్థానికుల నుండి సమాచారం సేకరించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు జమ్ములను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793