వైఎస్ కంచుకోటలో జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ జెండా ఎగరేసింది
పులివెందుల: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన ఘట్టం చోటుచేసుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అజేయ కోటగా నిలిచిన పులివెందులలో, టీడీపీ గెలుపు జెండా ఎగరేసింది. జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (బీటెక్ రవి భార్య) 6,050 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి, పసుపు జెండాను రెపరెపలాడించారు.
ఉపఎన్నికలో మొత్తం 8,103 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,735 ఓట్లు లభించగా, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఫలితంతో హేమంత్ రెడ్డి డిపాజిట్‌ను కోల్పోయి, వైసీపీ శ్రేణులకు పెద్ద షాక్ ఇచ్చారు.
ఎన్నికల ముందు లతారెడ్డి, హేమంత్ రెడ్డి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుందని అంచనా వేసినా, పోలింగ్ ఫలితాలు అన్ని లెక్కలను తారుమారు చేశాయి. జగన్ అడ్డా అని పేరుగాంచిన పులివెందులలో టీడీపీ ఘనవిజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో జోష్ పెరిగింది. మరోవైపు, వైసీపీ బలగాల్లో నిరాశా వాతావరణం నెలకొంది.
పులివెందులలోని ఈ ఫలితం, రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Post a Comment