స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంజుల పత్తిపాటి సందేశం
ఆలేరు: 2025 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి దేశభక్తి భావాలను వ్యక్తం చేశారు.
"భారత స్వాతంత్ర పోరాటం అలుపెరగని త్యాగ గాథ. గాంధీజీ అహింసా సిద్ధాంతంతో కోట్లాది మందిలో స్పూర్తిని నింపారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్ గురు వంటి మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్ర్యం సాధించారు. ఇంకా ఎంతోమంది స్వార్థం లేకుండా దేశ ప్రగతి, సంక్షేమం కోసం జీవితాలను అర్పించారు" అని ఆమె అన్నారు.
"దేశ స్వాతంత్రం కోసం పోరాడిన త్యాగధనులకు నివాళి అర్పించడం మన కనీస బాధ్యత. పర్యావరణ పరిరక్షణ, చట్టం గౌరవించడం, తోటి వారికి సహాయం చేయడం వంటి మంచి పనులు దేశానికి దోహదపడతాయి. మన దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి" అని మంజుల పత్తిపాటి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆమె అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..
Post a Comment