-->

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు


తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తుది సిద్ధతలు ప్రారంభించింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై అధికార పార్టీ వచ్చే నాలుగు నుండి ఐదు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నెల 16 లేదా 17వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పిఎసి సమావేశం జరగనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ రెడ్డి సర్కారు సన్నద్ధమవుతుండగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత రాకపోవడంతో పార్టీ పరంగా ఎన్నికలను అమలు చేయాలన్న దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి.

ఇక, ఎన్నికల నిర్వహణలో భాగంగా గుజరాత్‌ నుంచి 37,530 బ్యాలెట్ బాక్స్‌లు ఇప్పటికే హైదరాబాద్‌కు తరలించబడ్డాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో వీటిని జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం..

Blogger ఆధారితం.