-->

కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్


విజయవాడ, : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబ సమేతంగా విజయవాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు.

మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, దేశం, రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సమానమైన అభివృద్ధి, శాంతి, ఐక్యత కలగాలని ఆకాంక్షించారు. దర్శనానంతరం ఆయన ఆలయ పరిసరాల్లో భక్తులతో కలిసిమెలిసి మాట్లాడి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

భారీగా వచ్చిన భక్తుల రద్దీ మధ్య ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనాన్ని సజావుగా నిర్వహించారు.

Blogger ఆధారితం.