ఘోర రైలుప్రమాదం ఎదురెదురుగా ఢీకొన్న రెండు గూడ్స్ రైళ్లు
ఝార్ఖండ్ రాష్ట్రంలో శనివారం తెల్లవారు జామున ఘోర రైలుప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలు తప్పిన గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు ఢీకొట్టడంతో 21 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
రైల్వే అధికారుల సమాచారం ప్రకారం— ఇనుము లోడ్‌తో టాటా నగర్ నుంచి పురులియా వైపు వెళ్తున్న గూడ్స్ రైలు, చాందిల్ స్టేషన్ సమీపంలోని పిటాకీ గేట్ వద్దకు చేరుకునేలోపు 200 మీటర్ల దూరంలో పట్టాలు తప్పింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రతరం అయింది.
ఈ ఘటనలో ఇద్దరు ట్రైన్ డ్రైవర్లు గాయపడి ఆస్పత్రికి తరలించబడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, సుమారు 200 మీటర్ల మేర రైల్వే పట్టాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

Post a Comment