మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో ముందస్తు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
కొత్తగూడెం: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం కార్పొరేషన్ 12వ వార్డులోని సుభాష్ చంద్రబోస్ నగర్‌లో ఉన్న మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమానికి హాజరైన స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, "స్వాతంత్య్ర దినోత్సవం అంటే కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే కాదు. బానిస సంకెళ్ళను తెంచి మనకు స్వేచ్ఛను అందించిన పూర్వీకుల త్యాగాలను స్మరించుకోవడమే కాక, దేశ అభివృద్ధికి నీతి, నిజాయితీతో కృషి చేయాలని ప్రతిజ్ఞ చేసుకోవాలి" అని అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు దేశ సార్వభౌమత్వం, సమగ్రత, కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో జీవించే విలువలను ప్రతిబింబిస్తూ ప్రసంగాలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. "సారే జహాన్ సే అచ్ఛా హిందుస్తాన్ హమారా" పాటకు చిన్నారులు నృత్య ప్రదర్శన ఇచ్చి అందరినీ అలరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానాధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయులు లక్ష్మీ ప్రసన్న, శీరిషా, నీలా, నసురత్, సల్మా, సరస్వతి, విజయలక్ష్మి, నాజియా, సుహాన, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment