-->

కరెంట్ షాక్‌తో గ్రామ పంచాయతీ కార్మికుడి మృతి

కరెంట్ షాక్‌తో గ్రామ పంచాయతీ కార్మికుడి మృతి


సిద్దిపేట: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సన్నాహాల్లో విషాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో బుధవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జెండా ఎగరవేసేందుకు ఏర్పాటు చేస్తున్న ఇనుప పైపు విద్యుత్ తీగలకు తగలడంతో పంచాయతీ కార్మికుడు మోయిన్ పాషా (35) కరెంట్ షాక్‌కు గురయ్యాడు.

స్థానికులు వెంటనే స్పందించి అతన్ని హుటాహుటిన చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. స్వాతంత్ర్య దినోత్సవం కోసం ఉత్సాహంగా సిద్ధమవుతున్న గ్రామంలో ఈ ఘటన సంభవించడంతో వాతావరణం ఒక్కసారిగా విషాదమయం అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.